అనంతపురం జిల్లా కటారుపల్లి పరిసరాల్లో వర్షపు నీటిని నిల్వ ఉంచుకునేలా వాగులపై చెక్డ్యామ్స్ నిర్మించారు. వీటివల్ల పరిసర ప్రాంతాల్లోని బోరు బావుల్లో నీటి మట్టం పెరిగిందని స్థానికులు చెప్పారు. వేసవిలో అటవీ ప్రాంతంలోని మూగజీవాల దాహార్తిని సైతం తీరుస్తున్నాయన్నారు. కానీ..కొందరు వ్యక్తులు తమ గ్రామంలోని చెరువులు నింపుకునేందుకు చెక్ డ్యాములను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ విషయమై కటారుపల్లి వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
చెక్ డ్యాములు ధ్వంసం.. అధికారులకు ఫిర్యాదు - check dams news
అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో చెక్ డ్యాములను దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయంపై.. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
చెక్ డ్యాములను ధ్వంసం చేసి మళ్లిస్తున్న నీరు