ఆంధ్రప్రదేశ్-కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతంలో భారీ స్థాయిలో వర్షాలు కురవటంతో నీటి ప్రవాహాన్ని కిందకు వదిలారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నీరు మంత్రాలయం, కర్నూలు ప్రాంతాల నుంచి నదిలో కలిసి శ్రీశైలం చేరుకుంటున్నాయి. అధికారులు నీళ్లు విడుదల చేయటంతో.. తుంగభద్ర సరిహద్దు ప్రాంతంలో కోతులు వరదలో చిక్కుకుని అవస్థలు పడుతున్నాయి. వరదలో బయటకు రాలేకపోతున్న కోతులను గమనించిన స్థానికులు పడవలో వెళ్లి వాటి ఆకలి తీరుస్తున్నారు.
తుంగభద్ర వరదలో కోతులు..ఆకలి తీరుస్తున్న స్థానికులు - tungabhadra dam
తుంగభద్ర డ్యాం ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అధికారులు దిగువకు విడుదల చేశారు. దీంతో అనంతపురం జిల్లా సరిహద్దులోని లోతట్టు ప్రాంతాలు తుంగభద్ర జలాలతో నిండుకున్నాయి. ఆంధ్రా సరిహద్దులో చిక్కుకున్న కోతులకు కర్ణాటక వాసులు పడపలో వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు.
మర్కటాలకు పడవలో వెళ్లి ఆహారం ఇస్తున్నారు