అర్ధరాత్రి ఉద్రిక్తత... తమపై దాడి జరిగిందని దళితుల ఆరోపణ - assault on dalits
ఓ సామాజిక వర్గం వారు తమపై దాడి చేశారని వందలాది మంది దళితులు ఫిర్యాదు చేసేందుకు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఆ గ్రామానికి పోలీసులు చేరుకున్నారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో మొహరం సందర్భంగా తమపై దాడి జరిగినట్లు గ్రామానికి చెందిన వందలాది మంది దళితులు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కు అర్ధరాత్రి తరలి వచ్చారు. గ్రామంలో ఆనవాయితీగా మొహరం నిర్వహించుకునే తమను ఓ వర్గం వారు అడ్డగించారని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. గుడి మెట్లు కూడా ఎక్కనీయకుండా అడ్డగించి దాడికి ప్రయత్నించారని వెల్లడించారు. ఈ దాడిలో కొంత మంది గాయపడ్డారని వారు చెప్పారు. గ్రామంలో పరిస్థితిని చక్కపెట్టేందుకు కళ్యాణదుర్గం నుంచి పోలీసు అధికారులు అర్థరాత్రి దాటాక హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.