అనంతపురం జిల్లా కుందుర్పి మండలం కేంద్రంలో ఓ దళిత నాయకుడు అర గుండు గీయించుకుని ప్రభుత్వానికి తన వ్యతిరేకతను వ్యక్తపరిచాడు. కుందుర్పి(KUNDURPI) మండల కేంద్రానికి చెందిన దళిత నాయకుడు హనుమంతరాయుడు.. భారత్ బంద్‌లో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను(BHARAT BANDH NEWS) వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. హనుమంతరాయుడు అర గుండు, అర మీసం తీసుకుని తన నిరసన వ్యక్తం చేశారు.
BHARAT BANDH: కుందుర్పిలో ఓ వ్యక్తి వినూత్న నిరసన - అనంతపురం వార్తలు
అనంతపురం జిల్లా కుందుర్పిలో ఓ దళిత నాయకుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అరగుండు, అరమీసం గీయించుకున్నాడు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చేసిన చట్టాలను(BHARAT BANDH NEWS) వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
![BHARAT BANDH: కుందుర్పిలో ఓ వ్యక్తి వినూత్న నిరసన కుందుర్పిలో ఆరగుండుతో నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13187482-349-13187482-1632735188712.jpg)
కుందుర్పిలో ఆరగుండుతో నిరసన