ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుడు సుధాకర్​పై దాడిని ఖండిస్తూ ఆందోళన - విశాఖ వైద్యుడు సుధాకర్ వార్తలు

అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం మురడిలో దళిత సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. విశాఖ జిల్లాలో వైద్యుడు సుధాకర్​పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

Dalit community leaders protest for vishaka doctor sudhakar
వైద్యుడు సుధాకర్ పై దాడిని ఖండిస్తూ ఆందోళన

By

Published : May 22, 2020, 12:00 AM IST

విశాఖలో వైద్యులు సుధాకర్​ను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం మురడిలో దళితులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. సుధాకర్ విషయంలో అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత సంఘల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసులపై చర్యలు చేపట్టి సుధాకర్​పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

'ఫిబ్రవరిలో రూ. 700.. ఏప్రిల్​లో రూ. 8వేలా?'

ABOUT THE AUTHOR

...view details