రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీ తీశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ అవరణంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎస్సీ, ఎస్టీలను ఇబ్బందులు పెడుతున్నారని దళిత నాయకులు ఆరోపించారు. బీటెక్ రవి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలపై అనవసరంగా ఈ చట్టం వినియోగించి దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.
'ఎస్సీ, ఎస్టీ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు' - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దళిత సంఘాలు నిరసనకు దిగాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించాయి. బీటెక్ రవి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలపై అనవసరంగా ఈ చట్టాన్ని ప్రయోగించారని విమర్శించాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి.
దళిత సంఘాలు నిరసన