కరోనా లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు భాజపా సీనియర్ నాయకులు దేవానంద్ నిత్యావసర సరకులు అందజేశారు. మోదీ కిట్ పేరుతో అనంతపురం జిల్లా కదిరిలోని పేదలకు వీటిని పంపిణీ చేశారు. 4 నెలలుగా పనుల్లేక ఉపాధి కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.
మోదీ కిట్ పేరుతో పేదలకు సరకులు పంపిణీ - కదిరిలో నిత్యావసరాలు పంపిణీ
నాలుగు నెలలుగా ఉపాధి లేక ఆదాయం కోల్పోయి జీవనానికి ఇబ్బందులు పడుతున్న పేదలను పలువురు ఆదుకుంటున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నేత దేవానంద్ ఆధ్వర్యంలో నిరుపేదలకు సరకులు పంపిణీ చేశారు.

కదిరిలో నిత్యావసరాలు పంపిణీ