ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 9, 2019, 11:16 PM IST

ETV Bharat / state

100కి ఫోన్​ కొట్టు.. తక్షణ సాయం పొందు

ఆపద సమయాల్లో 100 కి ఫోన్ చేస్తే వెంటనే సాయం అందుతుందని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు నిరూపించారు. రైల్లో వెళ్తున్న రాధిక అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 100కి ఫోన్​ చేసింది. పోలీసులు తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించారు.

dail 100 and police save pregnent lady life
100కి ఫోన్​ కొట్టు.. తక్షణ సాయం పొందు

100కి ఫోన్​ కొట్టు.. తక్షణ సాయం పొందు

కడప నుంచి కర్నూల్ కి రైల్లో వెళ్తున్న రాధిక అనే మహిళకు తాడిపత్రి పట్టణ సమీపంలోకి రాగానే పురిటి నొప్పులు మొదలయ్యాయి. దిక్కుతోచని స్థితిలో గర్భిణి తల్లి 100 కి ఫోన్ చేసింది. పోలీసులు 108తో సహా హుటాహుటిన రైల్వే స్టేషన్ చేరుకుని రైలు కోసం వేచి ఉన్నారు. రైలు రాగానే గర్భిణిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన రాధిక మగ శిశువు జన్మినిచ్చింది. తల్లీబిడ్ద ఇద్దరూ ఆరోగ్యం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల చేసిన సహాయానికి రాధిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details