ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీతాఫలాలు అమ్ముతూ... జీవనోపాధి పొందుతూ.. - సీతాఫలం కాలం తాజా న్యూస్

సీతాఫలాల కాలం వచ్చిందంటే వారికి అదే జీవనోపాధి. చలిని తట్టుకుంటూ అటవీ మృగాలను ఎదుర్కొంటూ అటవీ ప్రాంతాల నుంచి పండ్లను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. అయితే ఇదంతా సాధారణమైన విషయం కాదు. సీతాఫలాలు అమ్మేవారి జీవితాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

custed apple become life earring in anantapur sellers
జీవనోపాధిగా మారిన సీతాఫలం

By

Published : Dec 17, 2019, 3:44 PM IST

జీవనోపాధిగా మారిన సీతాఫలం

ఈ మధ్య రోడ్లపై ఎక్కడా చూసినా సీతాఫలాలే దర్శనమిస్తున్నాయి. వాటిని విక్రయిస్తూ ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. అయితేరోడ్లపై పండ్లు విక్రయించేవారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ కాలం వచ్చిందంటే అటవీ ప్రాంతాలు, కొండచరియల్లో సీతాఫలాలు ఎక్కువగా పండుతాయి. రెండునెలల పాటు పుష్కలంగా అక్కడి ప్రజలకు జీవనోపాధి దొరుకుతుంది. కానీ వాటిని కోయటానికి వీరు ప్రాణాలకు తెగించి మరీ అడవుల్లో తిరుగుతుంటారు. జంతువుల బారి నుంచి తప్పించుకుంటూ... చలిని తట్టుకుని పండ్లను మార్కెట్​కు తీసుకువస్తుంటారు.

ఇంత కష్టపడి తీసుకువచ్చిన సీతాఫలాలను రూ.150 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. ఈ ఫలాల్లో చక్కెర, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, కొవ్వు పదార్థాలు, విటమిన్ సీ వంటివి ఎక్కువగా ఉంటాయని ప్రజలు కొనుగోలు చేస్తారు. అయితే కొందరు మాత్రం వారి కష్టాన్ని చూడకుండా తక్కువ ధరకే విక్రయించాలని అడుగుతుంటారని అమ్మకందారులు అంటున్నారు. ఎంతో కష్టపడి అడవుల నుంచి సీతాఫలాలు తీసుకువచ్చి విక్రయిస్తున్నామని... తమ కష్టానికి పెద్దగా మిగిలేది ఏమీ లేదని వారంటున్నారు.

ఇదీ చూడండి

అది..డెంగీ కాదు.. మలేరియా కాదు.. కానీ డేంజర్!

ABOUT THE AUTHOR

...view details