మడకశిర విద్యుత్ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ ఆపాలంటూ ఐకాస ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించిన ఆందోళన చేశారు.
బీఎస్ఎన్ఎల్, రైల్వేల మాదిరిగా విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసి తమ కడుపు కొట్టొద్దన్నారు. కేంద్రం ఇలాంటి చర్యలు విరమించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.