అనంతపురం జిల్లా రాయదుర్గం జాతీయ రహదారిపై స్థానికులకు భారీగా నగదు దొరికింది. రూ.10 లక్షల మేర రూ.500 నోట్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. వడ్రవన్నూరు శివారులో గుర్తుతెలియని వ్యక్తులు పడేసినట్లు తెలుస్తోంది. బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామస్తులు నోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు ఆరా తీస్తున్నారు.
జాతీయ రహదారిపై నోట్ల కట్టలు.. ఎవరివి..? - రాయదుర్గంలో రోడ్డుపై కరెన్సీ న్యూస్
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో రహదారిపై కరెన్సీ కలకలం రేపింది. జాతీయ రహదారిపై స్థానికులకు భారీగా నగదు దొరికినట్టు సమాచారం.
![జాతీయ రహదారిపై నోట్ల కట్టలు.. ఎవరివి..? currency on road in ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8570408-804-8570408-1598459208406.jpg)
currency on road in ananthapuram