అనంతపురం జిల్లా యల్లనూరు మండలం మేడికుర్తి గ్రామంలో.. అధికార పార్టీలో వేణుగోపాల్ రెడ్డి, జయరామిరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జయరామి రెడ్డి వర్గం గెలుపొందారు. ఓటమి జీర్ణించుకోలేని వేణుగోపాల్ రెడ్డి వర్గీయులు.. పథకం ప్రకారం జయరామిరెడ్డిని హత్య చేయడానికి సాగర్ గౌడ్ అనే వ్యక్తికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చారు. ఏప్రిల్ 30న పుట్లూరు మండలం ఒంటివేపమాను సమీపంలో.. జయరామిరెడ్డి వాహనాన్ని అపి కంట్లో కారం కొట్టి ఇనుప రాడ్లుతో దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఇతర వాహనాలు రావడంతో వారు పరారయ్యారు. బాధితుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి హత్యాయత్నానికి పాల్పడిన గోపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాగర్ గౌడ్ లతో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. వారి నుంచి నాలుగు ద్విచక్రవాహనాలు, ఆటో, నాలుగు ఐరన్ రాడ్లు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరచినట్లు డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి:
హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్ట్ - అనంతపురం జిల్లాలో యత్యాయత్నం కేసు వార్తలు
అనంతపురం జిల్లా యల్లనూరు మండలం మేడికుర్తి గ్రామంలో.. ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు తాడిపత్రి డీఎస్పీ చైతన్య తెలిపారు. అధికార పార్టీలో వేణుగోపాల్ రెడ్డి, జయరామిరెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉండేది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జయరామి రెడ్డి వర్గం గెలుపొందారు. ఓటమి జీర్ణించుకోలేని వేణుగోపాల్ రెడ్డి వర్గీయులు.. పథకం ప్రకారం జయరామిరెడ్డిని హత్య చేయడానికి ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చారు. పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

culprits arrest