ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు'

రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు సీఎం జగన్ విదేశీ పర్యటనలు చేశారని సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. ఈనెల 13 నుంచి 2రోజుల పాటు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరుగుతుందని వివరించారు.

By

Published : Sep 1, 2019, 8:51 PM IST

ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం

ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. 6మాసాల్లో వాటికి అమలుకు అడుగులు పడుతాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధి దర్శనం కోసం పుట్టపర్తి వచ్చిన సీఎస్... సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ... రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనలు చేశారని చెప్పారు. ఈనెల 13 నుంచి 2రోజుల పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ పారదర్శకంగా అమలు చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సత్యసాయి సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి అందిస్తున్న సేవలను కొనియాడారు. ప్రభుత్వ వైద్య సేవలు అనుసంధానం చేస్తే మరిన్ని ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. త్వరలో పుట్టపర్తి విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details