ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంక్ వద్ద బారులు తీరిన రైతులు

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ వద్ద ఖరీఫ్ పంట రుణాల రీషెడ్యూల్ కోసం వివిధ గ్రామాల నుంచి భారీగా రైతులు తరలిరావడంతో రద్దీ నెలకొంది.

ananthapuram district
స్టేట్ బ్యాంక్ వద్ద జనం

By

Published : May 11, 2020, 5:43 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పంట రుణాల రీషెడ్యూల్ కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. భారతీయ స్టేట్ బ్యాంక్ వద్ద వివిధ గ్రామాల నుంచి పంట రుణాల రీషెడ్యూల్ కోసం భారీగా రైతులు తరలిరావటంతో రద్దీ నెలకొంది. బ్యాంకు వద్ద రైతులు భారీగా బారులు తీరారు. రైతులు క్యూలైన్లలో భౌతిక దూరం మరచి ఒకరినొకరు తోసుకుంటూ బ్యాంకు వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాయదుర్గం ఎస్బీఐలో సోమవారం నుంచి రైతుల రుణాలు రీషెడ్యూల్ చేస్తామని అధికారులు పిలుపునివ్వటంతో ఒక్కసారిగా రైతులు తరలివచ్చారు. గ్రామాల వారిగా వారికి డేట్లు ఇవ్వాల్సిన బ్యాంకు అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. బ్యాంకు వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు అధికారులు కల్పించకపోవడంతో ఎండలో నిల్చుని ఉన్నారు.

అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ నానాటికీ విజృంభించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్​డౌన్ అమలవుతున్నా రుణాలు రీషెడ్యూల్ తీసుకోవాల్సిందేనని బ్యాంకు అధికారులు తెలపటంతో రైతులు వివిధ మండలాల గ్రామాల నుంచి వేకువజామునే తరలివచ్చి బ్యాంకు వద్ద క్యూ లైన్లలో నిలబడ్డారు. రైతులు గత ఏడాది తీసుకున్న రుణాలు చెల్లించి.. తిరిగి కొత్త రుణాలు పొందాలనడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణాలు ఒక్క ఏడాది గడువు దాటితే వడ్డీ భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సమీపిస్తుండడంతో రైతులు తమ రుణాలు రీషెడ్యూల్​కు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ఎస్బీఐ అధికారులు నిబంధనలు పాటించటం లేదని రైతులు, ప్రజలు వాపోతున్నారు. బ్యాంక్​ వద్ద భారీగా జనం ఉండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. భౌతిక దూరం పాటించాలని వారిని అదుపు చేశారు. ఎస్బీఐ అధికారులతో మాట్లాడి ప్రతిరోజు 50 మంది రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేసే విధంగా టోకెన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపడుతున్న క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

ఇది చదవండి 'గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో భవిష్యత్తులోనూ వైద్య శిబిరాలు'

ABOUT THE AUTHOR

...view details