ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం జిల్లాలో వరద ఉద్ధృతి.. మునిగిన పంటలు

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కుంటలు, కాలువలు తెగుతున్నాయి. వరద ఉద్ధృతికి పంట పొలాలు నీట మునిగాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

crop submerged at  anantapur district
అనంతపురం జిల్లాలో వరద ఉద్ధృతికి మునిగిన పంటలు

By

Published : Sep 16, 2020, 10:18 PM IST

అనంతపురం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. నీట మునిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. బొమ్మణహల్ మండలం, గోవిందవాడ గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేరుశనగ పంట పూర్తిస్థాయిలో మునిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి రావాల్సిన సమయంలో నీటి పాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అప్పులు తెచ్చి సాగు చేస్తున్నామని వర్షం తీవ్ర నష్టాలను మిగిల్చిందంటూ రైతులు వాపోయారు. నీటమునిగిన పంటలను అధికారులు పరిశీలించి ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు .

ABOUT THE AUTHOR

...view details