ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టం మిగిల్చిన వర్షాలు.. తీరని అన్నదాతల ఆవేదన - paddy farmers lost their crop news

వరుసగా కురిసిన వర్షాల ధాటికి అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ డివిజన్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే దశలో నీటి పాలైంది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

crop loss
పంట నష్టం

By

Published : Dec 12, 2020, 1:32 PM IST

నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. కుంటలు, చెరువులు నిండాయి. నీటిని సద్వినియోగం చేసుకుంటూ రైతులు విస్తారంగా వరి సాగు చేశారు. నివర్ తుఫానుతో పాటు.. ఏకధాటిగా కురిసిన వర్షాలకు అనంతపురంలో పంట చేలు నీట మునిగాయి. కోతకు వచ్చిన వరిమళ్లు వారం వరకు నీటిలోనే ఉండిపోవటంతో పొలంలోనే మొలకలు వచ్చాయి.

వానలకు ముందుగా వరికోసి.. కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని నిల్వ చేయలేకపోవటం వల్ల కూడా రైతులు నష్టపోయారు. వరి గింజలు తడిసి మొలకలు వచ్చాయి. కొంత ధాన్యం రంగు మారింది. వర్షాలు తగ్గిన తరువాత కొందరు రైతులు పంట కోతలకు సిద్ధమయ్యారు. కానీ వరిపైరు నేలకొరగటంతో కోతలు కష్టంగా మారాయి. ఫలితంగా ఎక్కువ కూలీ చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కదిరి వ్యవసాయ డివిజన్​లో 351 హెక్టార్లలో 980 మంది రైతుల పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు. మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి.. ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లాలో పవన్ పర్యటన... తుపాను బాధిత రైతులకు పరామర్శ

ABOUT THE AUTHOR

...view details