మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడం.. అనంతపురం జిల్లాలో కొన్నిచోట్ల రిటర్నింగ్ అధికారులపై విమర్శలకు.. ఆస్కారమిచ్చింది. ఆత్మకూరు మండలం మదిగుబ్బ పంచాయతీలో 132 ఓట్లతో భాస్కర్ నాయక్ గెలిచినట్లు చెప్పిన.. రిటర్నింగ్ అధికారి ప్రత్యర్థుల ఒత్తిడితో ధ్రువీకరణపత్రం ఇవ్వడంలో జాప్యం చేశారని.. ఓ వర్గం ఆరోపించింది. రెండోసారి ఓట్లు లెక్కించినా తొలుత గెలిచిన అభ్యర్థికే ఆధిక్యం వచ్చిందన్న వారు.. ఫలితం ప్రకటించకుండా మూడోసారి లెక్కించారని.. భాస్కర్ నాయక్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబులాపురంలోనూ అలేగా జరిగింది. 2 ఓట్ల ఆధిక్యంతో.. శ్రీనివాసులు గెలుపొందగా ప్రత్యర్థి రీ కౌంటింగ్ కు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే.. అధికారులు ధ్రువపత్రం ఇవ్వడంలో జాప్యం చేయడం.. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకునేందుకు యత్నించగా.. పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.
గెలుపొందిన అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థి వర్గం రాళ్లదాడి..