ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు..8 మంది అరెస్టు - క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న 8 మందిని అనంతపురం జిల్లా హిందూపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.88 వేల నగదు 8 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు

By

Published : Oct 20, 2020, 3:35 PM IST

ఐపీఎల్ మ్యాచ్‌లు క్రికెట్ అభిమానుల్లో ఒక రకమైన ఉత్కంఠ రేపుతుంటే,.. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం ఇదే అదునుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.88 వేల నగదు, 8 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో నలుగురు గ్రామ వాలంటీర్లు ఉన్నట్లు సమాచారం. క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details