అనంతపురం జిల్లా కదిరి మండలం వరిగిరెడ్డిపల్లి వద్ద బావిలో పూడిక తీస్తున్న సమయంలో క్రేన్ బోల్తా పడి వెంకటేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పూడిక తీస్తున్నప్పుడు ఒక్కసారిగా పూడికతో పాటు వెంకటేష్ బావిలోకి పడిపోయాడు. స్థానికులు స్పందించి బాధితుడిని చికిత్స కోసం కదిరికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.
బావిలో పూడిక తీస్తూ క్రేన్ బోల్తా.. ఒకరికి తీవ్రగాయాలు - ananthapur district
అనంతపురంలో జిల్లా వరిగిరెడ్డి పల్లి వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్న సమయంలో పూడిక తీసే యంత్రం ప్రమాదవశాత్తు బావిలోకి పడింది. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెను ప్రమాదం తప్పడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
బావిలో పూడిక తీస్తూ బోల్తా పడ్డ క్రేన్