ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేస్తున్నారని సీపీఎం నిరసన - ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటం లేదని సీపీఎం నాయకుల నిరసన

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా ఆలస్యం చేస్తున్నారని సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పట్టాలు పంపిణీ చేసి.. ఉరవకొండలో పేద ప్రజలకు పంపిణీ చేయకుండా.. నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

cpi
సీపీఐ నిరసన

By

Published : Apr 17, 2021, 8:39 PM IST

సీపీఐ నిరసన
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇంటి పట్టాలు పంపిణీ చేసిన వైకాపా ప్రభుత్వం.. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో వాయిదా వేస్తున్నారని సీపీఎం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఉరవకొండలోని పేద ప్రజలకు.. పట్టాలు పంపిణీ చేయకుండా ఆలస్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నిరసన చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్​కు తరలించారు. రాజకీయ స్వార్థం కోసం.. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా తమను బలి చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details