ఇంటిపన్ను, నీటిపన్ను చెత్తపన్ను పెంపు జీవోను రద్దు చేయాలని అనంతపురం జిల్లా హిందూపురంలో సీపీఏం నిరసన వ్యక్తం చేసింది. పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రతులను నిరసన కార్యక్రమంలో భాగంగా కాల్చివేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో. 196-197 సామాన్యులకు భారంగా మారే పరిస్థితి ఏర్పడిందని.. జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.
పన్నుల జీవోను రద్దు చేయాలని సీపీఏం ధర్నా - హిందూపురంలో సీపీఏం ధర్నా
అనంతపురం జిల్లా హిందూపురంలో సీపీఏం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేసిన పన్నుల పెంపు జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.
![పన్నుల జీవోను రద్దు చేయాలని సీపీఏం ధర్నా cpm protest at hindhupuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9736389-449-9736389-1606896110036.jpg)
హిందూపురంలో సీపీఏం ధర్నా