అనంతపురం కలెక్టరేట్ ఎదుట సీపీఎం నాయకులు పండ్ల రైతులతో కలిసి వినూత్న నిరసన చేపట్టారు. జిల్లాలో ఎండిపోయిన పంటల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎండిన చీనీ చెట్లతో ధర్నా చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ.... తక్షణం స్పందించి రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ చీనీ కాయలను రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. ఎన్నికల పేరుతో రైతులను పట్టించుకోవడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
చీనీ రైతులను ప్రభుత్వేమే ఆదుకోవాలి: సీపీఎం - cpm-nayakula-vinuthna-nirasana
చీనీ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
![చీనీ రైతులను ప్రభుత్వేమే ఆదుకోవాలి: సీపీఎం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3351715-326-3351715-1558520707789.jpg)
చీనీ రైతులను ప్రభుత్వేమే ఆదుకోవాలి... సీపీఎం నేతల డిమాండ్
చీనీ రైతులను ప్రభుత్వేమే ఆదుకోవాలి... సీపీఎం నేతల డిమాండ్
ఇవీ చదవండి