నంద్యాలలో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని తరలించాలని తెచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబులు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్కు ఈ విషయంపై లేఖ రాసినట్లు చెప్పారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించిన లేఖను విడుదల చేశారు.
పరిశోధన కేంద్రం ఉన్న 50 ఎకరాలలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు నాణ్యతతో కూడిన విత్తనాలను ఈ కేంద్రం నుంచి అందించారని గుర్తుచేశారు. వైద్య కళాశాల ఏర్పాటుకు తామేమీ వ్యతిరేకం కాదని, అయితే వ్యవసాయ కేంద్రానికి సంబంధించిన స్థలంలో కాకుండా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి కళాశాలల ఏర్పాటు చేయాలని కోరారు.