ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీని అరికట్టాలి: సీపీఎం నేతలు - ananthapuram latest news

అనంతపురంలో సీపీఎం నేతలు ఆందోళన చేశారు. కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అరికట్టాలని కోరారు. కొవిడ్​తో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

cpm leaders protest in ananthapuram
అనంతపురంలో సీపీఎం నేతలు ఆందోళన

By

Published : May 5, 2021, 7:06 PM IST

కరోనా వైద్యం పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం క్లాక్ టవర్ వద్ద వారు ఆ పార్టీ నేతలు నిరసన చేపట్టారు.

అనంతపురం, హిందూపురం ఆస్పత్రులలో అదనపు ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొవిడ్​తో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ బాధితులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details