ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను పెంపు ప్రజలకు భారం' - అనంతపురంలో వామపక్షాల నిరసనలు

అనంతపురంలో వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ నేతలు ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

cpm leaders protest
ఆస్తి పన్ను పెంపు ప్రజలకు భారం

By

Published : Dec 2, 2020, 6:44 PM IST

ప్రజలపై భారం మోపే జీవోలను వెంటనే రద్దు చేయాలని అనంతపురం నగరపాలక కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను పెంపు ప్రజలపై భారమవుతుందని సంబంధిత ఆర్డినెన్స్​ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

కబ్జాలో ప్రభుత్వ స్థలాలు: సీపీఐ

అనంత నగరంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. పార్కులు, ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల స్థలాలు సైతం కబ్జాకు అవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

కంబదూరులో అంబేడ్కర్ విగ్రహానికి పోలీసు రక్షణ

ABOUT THE AUTHOR

...view details