తమ కాలనీలకు వాలంటీర్ నియమించడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీపీఎం నగర కమిటీ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతపురంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీశ్రీనగర్ కాలనీకి వాలంటీర్ని నియమించాలని నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా కాలనీకి వాలంటీర్ను నియమించండి.. - తమ కాలనీకి వాలంటీర్ నియమించాలని సీపీఐ నాయకుల ధర్నా
తమ కాలనీకి వాలంటీర్ నియమించాలని కోరుతూ అనంతపురంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. అధికారుల చుట్టూ అనేక సార్లు తిరిగినా ప్రయోజనం లేదని ఆరోపించారు.
![మా కాలనీకి వాలంటీర్ను నియమించండి.. demanding for volunteer to their colony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10370247-154-10370247-1611574894871.jpg)
మా కాలనీకి వాలంటీర్ను నియమించండి
బడాబాబులకు వాలంటీర్లను నియమిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం వారికి అందిస్తున్నారని వారు ఆరోపించారు. పేద ప్రజలను పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కాలనీలకు వెంటనే వాలంటీర్లను నియమించాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'మంచి నేతను ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకోవాలి'