ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాలుగు లక్షల క్వింటాళ్ల వేరు శనగ విత్తనాలు సేకరించాలి ' - anantapuram cpm news

అనంతపురం జిల్లాలో రైతులు 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శ రాంభూపాల్ తెలిపారు. వారికి వన్ బీ ఫాం ద్వారా విత్తనాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

cpm leader rambhupal
cpm leader rambhupal

By

Published : Apr 29, 2021, 6:23 PM IST

ప్రభుత్వం రైతులకు వన్ బీ ఫారం ద్వారా వేరుశనగ విత్తనాలు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో రైతులు 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. నాలుగు లక్షల క్వింటాళ్లు వేరుశనగ విత్తనాలు సేకరించాల్సి ఉండగా ప్రభుత్వ అధికారులు మాత్రం రెండు లక్షల క్వింటాళ్లు మాత్రమే సేకరించారని తెలిపారు. వెంటనే మిగతా వాటిని సేకరించి రైతులకు అందించడానికి సిద్ధం చేయాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details