అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో గతంలో పేదల నివాస గృహాల పట్టాల కోసం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణపై హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఇదే అంశంపై అప్పట్లో రైతులు వ్యవసాయ కార్మిక సంఘం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టింది. అధికారుల తీర్పుపై కోర్టుకు పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా ఆ తీర్పుపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, రైతులు కోర్టు ఉత్తర్వులతో పొలంలోకి వెళ్లి ట్రాక్టర్లతో భూమిని దున్ని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు రైతుల భూమిని రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
హైకోర్టు తీర్పుపై సీపీఎం హర్షం - భూమిని దున్నిన సీపీఎం తాజా వార్తలు
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో పేదల ఇళ్ల పట్టాల కోసం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేపట్టిన విషయమై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై సీపీఎం నేతలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.
హైకోర్టు తీర్పుపై సీపీఎం హర్షం
ఇవీ చూడండి...