పౌరసత్య బిల్లుకు నిరసనగా సీపీఎం నిరసన
ప్రైవేటీకరణ, పౌరసత్య సవరణ బిల్లుపై సీపీఎం నిరసన - క్యాబ్ బిల్ న్యూస్ లేటెస్ట్
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. నగరంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను... ప్రైవేటు రంగాలకు అప్పగించి ప్రజలపై భారం తెచ్చే విధంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టారని ఆరోపణలు చేశారు. ప్రజలంతా ఏకమై భాజపాను గద్దె దించాలని పిలుపునిచ్చారు.
![ప్రైవేటీకరణ, పౌరసత్య సవరణ బిల్లుపై సీపీఎం నిరసన cpm darna opposing caa at ananthapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5939170-28-5939170-1580720319551.jpg)
నిరసన తెలుపుతున్న సీపీఎం నాయకులు