అనంతపురం జిల్లా మడకశిర మండలం కేతపల్లి గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూములను సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు సందర్శించారు. భూములు తీసుకుని 16 ఏళ్లు గడిచిన పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు.
గతంలో పరిశ్రమలకు గాను ఈ ప్రాంత రెైతులు 16 వందల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ఏళ్లు గడిచినా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. న్యాయస్థానం ఆదేశాల మేరకు పరిశ్రమల కోసం రైతుల నుంచి తీసుకున్న భూమిలో ఐదు ఏళ్లలోపు పరిశ్రమలు ఏర్పాటు చేయకపోతే వాటిని తిరిగి రైతులకే ఇవ్వాలి. అయినా ప్రభుత్వం మీ భూములు మీకు ఇవ్వలేదు. ఈ క్రమంలో భూముల కోసం మీరు చేస్తున్న పోరాటానికి మద్దతుగా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని కమిటీ సభ్యులు శ్రీనివాస రావు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో శ్రీనివాస రావుతోపాటు దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నూర్ మహమ్మద్, తదితర నాయకులు పాల్గొన్నారు.