విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని సీపీఎం నాయకులు ఆరోపించారు. అనంతపురం జిల్లా కదిరిలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను మోదీ సర్కార్ తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యమన్న సీఎం జగన్.. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం అధికార, విపక్ష పార్టీలు కృషి చేయాలని కోరారు. ఆనాడు ఇచ్చిన హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విభజన హామీల అమలు కోసం సీపీఎం బైక్ ర్యాలీ - విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం కదిరిలో సీపీఎం బైక్ ర్యాలీ
ఏపీ విభజన, ప్రత్యేక హోదా హామీల అమలుపై సీపీఎం నాయకులు.. అనంతపురం జిల్లా కదిరిలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి.. సీఎం జగన్ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కదిరిలో సీపీఎం ద్విచక్ర వాహన ర్యాలీ