ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండుటెండలో నడిరోడ్డుపై సీపీఎం నాయకుల నిరసన - ప్రభుత్వంపై మండిపడిన సీపీఎం

వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మండుటెండలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారుల సమన్వయ లోపంతో వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.

cpm agitation on govt
మండుటెండలో రహదారిపై బైఠాయించిన సీపీఎం నాయకులు

By

Published : May 17, 2020, 4:09 PM IST

అనంతపురం జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలు వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా మారాయంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆరోపించారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బెంగళూరు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. మండుటెండలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులందర్నీ ఒకే చోట ఉంచటంతో ఇప్పటికే 43 మందికి పైగా వైరస్ సోకిందని అన్నారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ధ్వజమెత్తారు. కార్మికులను స్వస్థలాలకు చేర్చటంలో అధికారుల మధ్య సమన్వయం లేదని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details