ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తోందని అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి జగదీష్ అన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను బెదిరించి ఏకపక్షం కావాలని చూసిందని ఆరోపించారు. ఈ విషయాన్ని గమనించిన ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు.
'ఎన్నికల వాయిదాను సీపీఐ స్వాగతిస్తోంది' - ap farmer minister chandrababu naidu
ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తోందని ఆ పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వైకాపా ప్రభత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
'ఎన్నికల వాయిదాను సీపీఐ స్వాగతిస్తోంది : అనంతపురం జిల్లా కార్యదర్శి జగదీశ్