CPI RAMAKRISHNA: మూడేళ్ల పాలనలో సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మద్యపానం నిషేధిస్తామని చెప్పి.. ఇప్పుడు దానికి మంగళం పాడారని ఎద్దేవా చేశారు. మద్యంపై వస్తున్న ఆదాయాన్ని చూపి .. మళ్లీ రూ.800 కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో రహదారులు పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్న ఆయన.. రోడ్లపై గుంతల్లో వైకాపా ఎమ్మెల్యేలు సైతం కింద పడుతున్నారని విమర్శించారు. ప్రజా, రైతు సమస్యలపై ఆగస్టు 26, నుంచి 28 వరకు విశాఖలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు.
CPI RAMAKRISHNA: సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: రామకృష్ణ - అనంతపురం జిల్లా తాజా వార్తలు
CPI RAMAKRISHNA: మూడేళ్ల పాలనలో సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మద్యంపై వస్తున్న ఆదాయాన్ని చూపి .. మళ్లీ అప్పు తెచ్చేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు