CPI Ramakrishna Fired On Jagan: ఇద్దరు నియంతలు హిట్లర్, కిమ్‌ను కలిపితే జగన్ అని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సభలు, ర్యాలీల నిషేధమే దీనికి నిదర్శనమన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ జీవో అందరికీ వర్తిస్తుందని సజ్జల రామకృష్ణ చెప్పారు. కానీ రాజమండ్రిలో సీఎం సభకు, నందిగామలో వైసీపీ నేతల సభలకు వర్తించవా అని ప్రశ్నించారు. పోలీసులు చట్టప్రకారం పని చేయడం లేదన్నారు. జీవో 1కి వ్యతిరేకంగా సమైక్య ఉద్యమానికి శ్రీకారం చూడతామన్నారు.
హిట్లర్, కిమ్‌ను కలిపితే జగన్ ..ప్రభుత్వ జీవోలు వైసీపీకి వర్తించవా ? : రామకృష్ణ - Ramakrishna expressed his anger on CM Jagan
CPI Ramakrishna Fired On Jagan: జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జీవో 1 అందరికీ వర్తిస్తుందని అన్నారు.. కానీ సీఎం సభకు ఎలా అనుమతి వచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వం తెచ్చిన జీవోపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు.
![హిట్లర్, కిమ్‌ను కలిపితే జగన్ ..ప్రభుత్వ జీవోలు వైసీపీకి వర్తించవా ? : రామకృష్ణ Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17411233-376-17411233-1672988245869.jpg)
Etv Bharat
"బ్రిటీష్ వాళ్లు ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు.. దేశవ్యాప్తంగా ఎటువంటి తిరుగుబాటు రాకుండా ఎక్కడికక్కడ అణచివేయాలని తెచ్చిన చట్టమే ఈ జీవో 1. దానిని ఈ మహానుబావుడు ఇప్పుడు తీసుకొనివచ్చారు. సీఎం గారికి వర్తించదు.. నందిగామలో అధికార పార్టీ నేతలకు వర్తించదు. కానీ చంద్రబాబు నాయుడు కుప్పం పోతే అడ్డుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే సొంత నియోజకవర్గానికి పోతుంటే.. పోలీసులు అడ్డుకుంటున్నారు. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని అడుగుతున్నాను". - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్-1 పై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఇవీ చదవండి: