ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఐ రామకృష్ణ

ఎడతెరిపి లేకుండాకురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా మిడుతూరు గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ, పత్తి, పంట పొలాలను పరిశీలించారు.

damaged agriculture and horticulture crops in kurnoo
'నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఐ రామకృష్ణ

By

Published : Oct 11, 2020, 10:50 PM IST

అనంతపురం జిల్లా మిడుతూరు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న వేరుశనగ, పత్తి, పంట పొలాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. గత నెలలో జిల్లాలో కురిసిన వర్షాలకు వేరుశనగ పత్తి పంట పూర్తిగా నీట మునిగిందని... ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

పశు గ్రాసం కూడా పనికిరాకుండా కుళ్లిపోయిందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకుని వాళ్లకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కాటమయ్య, మండల నాయకులు సూర్యనారాయణ రెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details