కరోనా విపత్కర పరిస్థతుల్లో తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలే భారం మోపుతున్నాయని సీపీఐ(cpi) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(ramakrishna) మండిపడ్డారు. కొవిడ్ కట్టడికి ప్రభుత్వాలు చేస్తున్న సేవలంటే స్వచ్ఛంద సంస్థలు, ఇతర పార్టీల వాళ్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన అనంతపురంలోని ఆదినారాయణ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ అసోసియేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.
తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న వైకాపా రాష్ట్రంలో ఏకపక్షంగా పన్నులు పెంచడం సరికాదన్నారు. కరోనా కట్టడి కోసం వసూలు చేసిన ఫండ్‌ను ఏం చేశారని ప్రశ్నించారు. 137 కోట్ల ప్రజలకు ఈ ఏడాదిలోనే రెండు డోసులు(dose) వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటిపైనా త్వరలో వామపక్షా పార్టీలు కలిసి పోరాడుతామని తెలిపారు.