CPI Ramakrishna on Universities in AP: సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టిస్తున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో అధికార వైసీపీ నేతల ఆక్రమణకు గురవుతున్న ఐదెకరాల భూమిని, అదే విధంగా విద్యార్థి సంఘాలు వ్యతిరేస్తున్నా బలవంతంగా వర్సిటీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు.
CPI Ramakrishna Fires on CM Jagan: జగన్ మోహన్ రెడ్డి నియమించిన వీసీలు యూనివర్సిటీలను రాజకీయ వేదికలుగా మారుస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. పోలీసు బందోబస్తు మధ్య అర్దరాత్రి వేళ విగ్రహాన్ని పెట్టించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవటంలేదని ఆరోపించారు. ఎస్కేయూలో తనతో పాటు చదువుకున్న అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి అధికార పార్టీలో ఉన్నారని, యూనివర్సిటీ భ్రష్టుపట్టిపోతున్నా పట్టించుకోరా అంటూ వారిని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపితే తప్ప యూనివర్సిటీలు బాగుపడవని రామకృష్ణ అన్నారు.
పంతం నెగ్గించుకున్న ఎస్‌కేయూ వీసీ - విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసులు
YSR Statue in SKU: నవంబర్ 22వ తేదీన అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎస్కేయూ ఆవరణలో వైఎస్ విగ్రహాన్నిఏర్పాటు చేయడాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా సరే యూనివర్సిటీ వీసీ రామకృష్ణారెడ్డి ఆందోళనల నడుమ విగ్రహావిష్కరణ చేయించగా ఈ రోజు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు.