ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బెదిరిస్తే పారిశ్రామికవేత్తలు ఉంటారా..?' - కియాను సందర్శించిన సీపీఐ రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా తీరుతో పెట్టుబడిదారులు భయపడిపోతున్నారని ఆరోపించారు.

cpi ramakrishna fires on govt
కియా పరిశ్రమను సందర్శించిన సీపీఐ రామకృష్ణ

By

Published : Feb 12, 2020, 1:18 PM IST

Updated : Feb 12, 2020, 1:45 PM IST

మాట్లాడుతున్న రామకృష్ణ

చట్టసభల్లో చేసిన శాసనాలను అధికారులు ధిక్కరించే పరిస్థితి ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. కియా పరిశ్రమ పరిశీలనకు జిల్లాకు వచ్చిన రామకృష్ణ... ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి తీరును ఎండగట్టారు. ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారని... ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా 3 రాజధానుల నిర్ణయాన్ని అసెంబ్లీలో ఆమోదించారని మండిపట్టారు.

శాసనసభకు ఎలాంటి అధికారాలు ఉన్నాయో... మండలికి అవే అధికారాలు ఉన్నాయన్న విషయం ఈ ప్రభుత్వం గుర్తించటంలేదని పేర్కొన్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్ ఆదేశాలను అక్కడి కార్యదర్శి ధిక్కరించారంటే ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్థమవుతోందని రామకృష్ణ విమర్శించారు. కియాకు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు గత ప్రభుత్వం భూములు ఇవ్వగా... ఈ ప్రభుత్వంలో పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:అక్రమ అరెస్టులను నిరసిస్తూ సీపీఐ ఆందోళన

Last Updated : Feb 12, 2020, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details