సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్లో విక్రయించడాన్ని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan)కు రైతుల ఉద్యమాలు కనిపించడం లేదా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi ramkrishna news) విమర్శించారు. అనంతపురంలో ఎండిన ఖరీఫ్ పంటలను పరిశీలించిన రామకృష్ణ.. పవన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సినిమావాళ్ల ఒత్తడితో టికెట్ల విక్రయాలపై మాట్లాడటం మంచిదే కానీ.. ఏడు వందల రోజులుగా అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం గురించి మాట్లాడి ఉంటే బాగుండేదన్నారు.
రైతుల ఉద్యమం పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా?: సీపీఐ రామకృష్ణ - అనంతపురం జిల్లా ముఖ్య వార్తలు
సినిమా టికెట్లపై ప్రస్తావించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రైతుల ఉద్యమాలు కనిపించడం లేదా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi ramakrishna) విమర్శించారు.
సీపీ ఐ రామకృష్ణ
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు దేశవ్యాప్తంగా రైతులు పోరాడుతున్నా.. వారి గురించి పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఉద్యమం చేస్తున్న రైతులను ప్రధాని మోదీ ఒక్కసారి కూడా పిలిచి మాట్లాడని పరిస్థితిపై పవన్ ప్రశ్నించటం లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి: