ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్​ తప్ప.. అందరూ ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు' - సీఎం జగన్​పై సీపీఐ రామకృష్ణ కామెంట్స్

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి వ్యవహార తీరు రాజ్యాంగానికి విఘాతం కలిగించేలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీపడుతున్న సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు.

cpi ramakrishna comments on cm jagan
cpi ramakrishna comments on cm jagan

By

Published : Apr 6, 2021, 5:05 PM IST

అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని.. ప్రతి రాజకీయ పార్టీ కోరుకుంటుందని సీపీఐ రామకృష్ణ చెప్పారు. ఇందుకు భిన్నంగా సీఎం తీరు ఉందని.. అన్ని సీట్లను తమ పార్టీ అభ్యర్థులే గెలవాలని మంత్రులకు లక్ష్యాన్ని నిర్దేశించడమే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.

నీలం సంజీవరెడ్డి మొదలుకొని నేటి వరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో జగన్ తప్ప అంతా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనేది సరైన ఆలోచన కాదన్నారు. పరిషత్ ఎన్నికల ప్రకటన విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని తీరు.. అభ్యర్థుల హక్కులకు విఘాతం కలిగించేలా ఉందన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details