కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. ఆ చట్టాలకు సంబంధించిన జీవో పేపర్లను బోగి మంటల్లో వేసి తగులపెట్టారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లక్షల మంది రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
నల్ల చట్టాలను రద్దు చేయాలి: సీపీఎం - అనంతపురం సీపీఎం వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు
కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఆ చట్టాల ప్రతులకు సంబంధించిన జీవోలను భోగి మంటల్లో వేసి కాల్చారు.
![నల్ల చట్టాలను రద్దు చేయాలి: సీపీఎం cpi protest on farm laws at bukkarayasamudram at anantpuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10227535-1072-10227535-1610532866566.jpg)
నల్ల చట్టాలను రద్దు చేయాలి: సీపీఎం