లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గృహాలకు 50 శాతంతో రాయితీ విద్యుత్ ఇవ్వాలని కోరుతూ సీపీఐ అనంతపురం జిల్లా కార్యదర్శి డి.జగదీష్ తన కార్యాలయంలో నిరసన దీక్షల చేపట్టారు. లాక్డౌన్ మార్చి నుంచి ఏప్రెల్ వరకు ఉంటే మే నెలలో ఒక్కసారిగా వేలకు వేలు విద్యుత్ చార్జీలు ఎలా పెంచారన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలే కానీ ప్రజలపై అధిక భారం మోపడం సరికాదన్నారు. మరోవైపు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇస్తున్నామని చెప్పి వెనక్కి తీసుకుంటున్నారని ఆరోపించారు.
విద్యుత్ బిల్లులపై అనంతపురంలో సీపీఐ నేతల దీక్ష - విద్యుత్ బిల్లుల తాజా వార్తలు
విద్యుత్ చార్జీలే కాకుండా మద్యం, మరికొన్నింటి ధరలు పెంచి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని అనంతపురం జిల్లా సీపీఐ నాయకులు ఆరోపించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ భౌతిక దూరం పాటించి శాంతియుతంగా పార్టీ కార్యాలయంలోనే దీక్షలు చేపట్టామని తెలిపారు.
విద్యుత్ బిల్లులపై అనంతపురం సీపీఐ నేతల దీక్ష