అనంతపురం జిల్లా హిందూపురంలోని మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో జీవో ప్రతుల కాల్చివేత కార్యక్రమాన్ని ప్రజాసంఘాల కార్యకర్తలు నిర్వహించారు. పెంచిన ఇంటి పన్ను జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై పన్నులను పెంచుతూ జీవోలు విడుదల చేయడం మంచి పద్ధతి కాదని సీపీఐ నాయకులు అన్నారు.
సామాన్య ప్రజల నడ్డి విరిచేలా పన్నుల జీవోలు - అనంతపురంలో సీపీఐ నిరసన
పెంచిన ఇంటి పన్నుల జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. పెంచిన పన్నుల జీవో కాపీలను దగ్ధం చేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.
సామాన్య ప్రజల నడ్డి విరిచేలా పన్నుల జీవోలు
ఇంటి, ఆస్తి, కుళాయి, తదితర పన్నులను పెంచినట్టు.. 196, 197, 198 జీవోలను ప్రవేశపెట్టడం చాలా బాధాకరమని తెలిపారు. ఇవి సామాన్య ప్రజల నడ్డి విరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెంచిన పన్నుల జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో కాపీలను దగ్ధం చేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.