మడకశిర పట్టణం అంబేడ్కర్ కూడలిలో సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను కేటాయించాలని ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఏప్రిల్ నాటికి ఇళ్ల నిర్మాణాలు 90 శాతం పనులు పూర్తయ్యాయి. వాటిని తుది మెరుగులు దిద్దకుండా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేసిందని సీపీఐ నియోజకవర్గ ఇంఛార్జ్ పవిత్ర అన్నారు. ప్రభుత్వం చొరవ చూపి లబ్దిదారులకు అందించాలని కోరారు. కోర్టులో వివాదం లేని భూములను పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల వారికి మూడు సెంట్ల చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.
'అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి' - అనంతపురం జిల్లా సీపీఐ నాయకుల నిరసన తాజా వార్తలు
అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను కేటాయించాలని మడకశిర పట్టణంలో సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు.

అంబేడ్కర్ కూడలి వద్ద సీపీఐ నాయకుల నిరసన