CPI Narayana: వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు బిగిస్తే రైతులు తిరగబడి ముఖ్యమంత్రికి ఉరితాడుగా మారుతారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ అనంతపురంలోని పాతూరు తాడపత్రి బస్టాండ్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఎడ్ల బండిపై ఉరితాళ్లు తగిలించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం 22 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
"పంపుసెట్లకు మోటార్లు బిగిస్తే.. రైతులే ఎదురు తిరుగుతారు" - అనంతపురం జిల్లా తాజా వార్తలు
CPI Narayana: వ్యవసాయ పంపుసెట్లకు మోటార్లు బిగిస్తే రైతులే ఎదురుతిరిగే పరిస్థితి వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భాజపా అడుగుజాడల్లోనే వైకాపా నడుస్తోందని ఆరోపించారు. అనంతపురంలో ఎడ్లబండిపై రైతులతో కలిసి ఉరితాళ్లు తగిలించుకుని ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం 22 నెంబర్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ నేత నారాయణ నిరసన
రాష్ట్రంలో భాజపాకు వైకాపా దత్తపుత్రిడిలా పని చేస్తోందని విమర్శించారు. కేవలం కార్పొరేట్ శక్తులకు ఆదాయం సమకూర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఉందని దుయ్యబట్టారు. భాజపా అడుగుజాడల్లోనే వైకాపా నడుస్తోందని ఈ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధిచెప్పే సమయం దగ్గరలోనే ఉందన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు మీటర్లు బిగించేందుకు తీసుకుంటున్న చర్యలు వెంటనే ఆపాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: