ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపాను ఎదిరించే ధైర్యం వైకాపాకు లేదు: నారాయణ - అనంతపురం జిల్లా వార్తలు

భాజపాను ఎదిరించే ధైర్యం వైకాపాకు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలన్నింటికీ వైకాపా వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. దౌర్జన్యాలతో మున్సిపాలిటీలను చేజిక్కించుకొనే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్లు తమ ఓటును సరైన వ్యక్తికి వేయాలని కోరారు.

cpi narayana municipal campaign
సీపీఐ నారాయణ

By

Published : Mar 7, 2021, 2:54 PM IST

కేంద్రం ప్రజా వ్యతిరేక చర్యలన్నింటికీ వైకాపా వత్తాసు పలుకుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అనంతపురం జిల్లా కదిరిలో 31, 32 వార్డులలో పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. బెదిరింపులు, అపహరణలు, దౌర్జన్యాల ద్వారా మున్సిపాలిటీల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నా కేంద్రాన్ని వైకాపా ప్రశ్నించే స్థితిలో లేదన్నారు. వైకాపా దౌర్జన్యాలను ఓటర్లు గ్రహించాలని.. తమ విలువైన ఓటును సరైన వారికి వేయాలని కోరారు.

ఇదీ చదవండి: ఎంఐఎంను గెలిపిస్తే.. ఎన్నార్సీ, ఎన్​పీఆర్​పై పోరాటం: అసదుద్దీన్

ABOUT THE AUTHOR

...view details