ఎన్నికల కమిషన్‌ను లెక్కచేయకుండా ఇష్టానుసారంగా బెదిరింపులతో ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ స్నేహితుడే కాబట్టి అన్ని పదవులు నామినేట్ చేసుకోవడానికి అనుమతి తెచ్చుకుంటే ఎన్నికలుండవని వ్యంగంగా వ్యాఖ్యానించారు. ఎన్నికలు లేకపోతే రేపిస్టులను, దౌర్జన్యకారులను, డెకాయిట్లను పదవుల్లో నామినేట్ చేసుకోవచ్చని ఘాటు విమర్శలు చేశారు.
ఇక్కడ పాదయాత్ర, దిల్లీలో పాదపూజా..?: నారాయణ - CPI Narayana comments YCP
అధికార పార్టీ నేతలు... ఇక్కడ పాదయాత్ర, దిల్లీలో పాదపూజ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. నోటాకు రాజ్యాంగబద్ధత తీసుకొచ్చి ఏకగ్రీవాలు లేకుండా ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణ, తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కలిసి అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు.

విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చేస్తుంటే జగన్ లేఖరాసి చేతులు దులుపుకున్నారని నారాయణ విమర్శించారు. విశాఖ సమస్యపై గట్టిగా కేంద్రాన్ని నిలదీయాల్సిన అధికార పార్టీ నేతలు... ఇక్కడ పాదయాత్ర, దిల్లీలో పాదపూజ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రచారంలో ఉన్న తెదేపా అభ్యర్థులపై కేసులు పెడతామని బెదిరించి వైకాపాలోకి తీసుకుంటున్నారంటూ... తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాను చేసే పనులకు తగిన మూల్యం చెల్లించుకుంటారని ప్రభాకర్ చౌదరి హెచ్చరించారు.
ఇదీ చదవండీ... అమరావతి కోసం విజయవాడలోని ఇంటికొకరు రావాలి: చంద్రబాబు