CPI Narayana News: హీరో నాగార్జున మహిళలను కించపరిచేలా ప్రదర్శిస్తున్న బిగ్బాస్ షోను నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. బిగ్బాస్ షోను నిలిపివేయాలని సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ ప్రచారం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ షోను నిషేధించాలని కోర్టును ఆశ్రయించామన్నారు. ఈ మేరకు అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు.
హీరోయిన్ ఫోటోలను తెరపై చూపించి ఎవరితో ఎలా ఉంటావని షోకు వచ్చిన వ్యక్తిని అడగటంపై ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ షోకు సంబంధించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శీతల పానీయాల ప్రకటనలు చేసిన హీరో చిరంజీవిని అప్పట్లో తాము హెచ్చరించగా.. ఆయన వాటిని మానేశారు.. ప్రస్తుతం మహేష్ బాబు కూడా కూల్ డ్రింగ్ ప్రకటనల్లో పాల్కొనడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయనకు చెప్పగా.. ఒప్పంద గడువు ముగిశాక మానేస్తామని మహేశ్ తమకు చెప్పినట్లు నారాయణ తెలిపారు.