ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరిశ్రమ ఏర్పాటు చేస్తారా.. భూములు వెనక్కి ఇస్తారా..? : సీపీఎం - అనంతపురం పరిగి మండలంలో విత్తనాలు వేసి సీపీఎం నాయకుల ధర్నా

స్వాధీనం చేసుకున్న భూములలో పరిశ్రమల ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ... పరిగి మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు.. రైతులతో కలిసి ఆ భూముల్లో దుక్కి దున్ని విత్తనాలు వేశారు.

cpi leaders protest for factory at parigi Mandal Anantapur district
పరిశ్రమ ఏర్పాటు చేస్తారా.. లేక భూములు వెనక్కి ఇస్తారా: సీపీఎం

By

Published : Sep 24, 2020, 5:45 PM IST

14 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రసాయన పరిశ్రమల ఏర్పాటు కోసం అనంతపురం జిల్లా పరిగి, మడకశిర మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన రైతుల నుంచి 2వేల ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు పరిశ్రమేదీ రాలేదు. దీంతో భూములు ఇచ్చిన రైతులు జీవన ఉపాధి కోల్పోయారని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.... ఆ పార్టీ ఆధ్వర్యంలో భూములు ఇచ్చిన రైతులతో కలసి ఆ భూములను దున్ని విత్తనాలు వేసి నిరసన వ్యక్తం చేశారు.

వెంటనే భూములలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని లేనిపక్షంలో రైతుల భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించాలని లేనిపక్షంలో రైతుల భూ పోరాట కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:తొలి గాడిద పాల డెయిరీ- లీటరు రూ.7వేలు మాత్రమే!

ABOUT THE AUTHOR

...view details